వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే..వైసీపీ కి సర్వే షాక్..!!

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 21:

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది పెద్ద చర్చ. దాని మీద సర్వేలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక ఎవరి మటుకు వారు తమ పార్టీయే గెలుస్తుంది అని అంటూంటారు. అయితే ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి వైఎస్సార్ సమకాలీనుడు అయిన డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి ఒక సంచలన  సర్వే వినిపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే అది కూడా గొప్పే అన్నారు. అంటే వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని డీఎల్ చెప్పడం విశేషమే అనుకోవాలి.

డీఎల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ని అతి పెద్ద అవినీతిపరుడిగా కూడా విమర్శించారు. జగన్ వైఎస్సార్ కుమారుడిగా తాము వేరేగా చూశామని అయితే ఆయన అంత అవినీతిపరుడు మరొకరు లేరు అని డీఎల్ విమర్శలు గుప్పించారు.  ఇక ఏపీని వైసీపీ సర్వనాశనం చేసింది అని ఆయన దుయ్యబెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీని కాపాడాలీ అంటే అది ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యమని కూడా డీఎల్ చెప్పారు.మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేమని అన్నారు. అయితే జనసేన టీడీపీ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని అనుకుంటున్నట్లుగా డీఎల్ అంటున్నారు. ఆ పార్టీలు కలసి పోటీ చేస్తే ఏపీలో వైసీపీకి ఒంటరి సంఖ్యలొనే సీట్లు వస్తాయని అది కూడా గొప్పే అని ఆయన అన్నారు.

ఇక వైఎస్ వివేకా కేసు విచారణ జనవరి 3 నుంచి జరగనుందని దాంతో కొత్త మలుపు ఈ కేసు తిరుగుతుందని డీఎల్ అంటున్నారు. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలకమైన వ్యక్తి అని సీబీఐ గుర్తించిందని ఆయన అన్నారు. ఇక జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద వాదనలు ఉన్నాయని ఆ రోజున సుప్రీం తీర్పు తరువాత కడప జిల్లాలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని డీఎల్ అంటున్నారు.మాజీ మంత్రి  వివేకా  కేసుతో చాలా మంది మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది అని ఆయన పేర్కొనడం విశేషం. ఇదిలా ఉండగా వివేకా హత్య కేసు విషయంలో ఒంటరిగా ఆయన కుమార్తె సునీత పోరాడడం మెచ్చుకోవాల్సిందే అని ఆయన అన్నారు.

ఇక తన గురించి చెబుతూ ఈ రోజుకీ తాను వైసీపీలోనే ఉన్నానని తనను ఎవరూ తీసేయ లేదని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఏదో ఒక ప్రముఖ పార్టీ నుంచే పోటీకి దిగుతాను అని డీఎల్ చెబుతున్నారు. మొత్తానికి డీఎల్ వైసీపీ మీద జగన్ మీద కడప జిల్లా రాజకీయాల మీద సంచలన కామెంట్స్ చేశారు. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్