సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఏపీ అగ్రస్థానం..ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22:

మహారాష్ట్ర.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. ముంబై నాగపూర్ ఫూణే భీవండి సహా ఎన్నో నగరాలు ఉండడంతో ఇక్కడికి వలసవచ్చే వారితోపాటే సెక్స్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇన్నాళ్లు మహారాష్ట్రనే దేశంలో తొలి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడా తొలి స్థానాన్ని మన ఏపీ లాగేసుకుంది. దేశంలోనే సెక్స్ వర్కర్లకు నిలయంగా మారింది. ఈ లెక్కలు తాజాగా కేంద్రం చెప్పినవి కావడంతో అందరూ అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది.

స్థానిక సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది. స్థానిక సెక్స్ వర్కర్లు వలస వచ్చిన సెక్స్ వర్కర్లను కలిపి లెక్కిస్తే ఏపీ దేశంలోనే అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉందని చాలా ఎన్జీవో సంస్థలు తేల్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసింది.ఈ నివేదిక ప్రకారం స్థానిక సెక్స్ వర్కర్లు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉన్నారు. కర్ణాటకలో 1.16 లక్షల మంది తెలంగాణలో లక్ష మంది ఈ పని ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మహారాష్ట్రను విడిచిపెట్టి 6.6 లక్షల మంది వలస సెక్స్ వర్కర్లు దేశంలో నివసిస్తుంటే.. గుజరాత్ (2.3 లక్షలు) ఢిల్లీ (2.3 లక్షలు) తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. చాలా కాలంగా అక్రమ మానవ రాకపోకలకు ఏపీ అడ్డుగా నిలుస్తోంది.

దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న సెక్స్ వర్కర్లు ఎదురవుతున్నారు. ఈ లెక్కలు ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఉంటాయి. లెక్కలు చూపని వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారని సామాజిక కార్యకర్త ఎన్ రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం ఓ ఎన్జీవోను నడుపుతున్నాడు.మహారాష్ట్ర గుజరాత్లతో పోలిస్తే ఏపీలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నప్పటికీ ఆమోదయోగ్యంగా లేదని.. మహారాష్ట్రలోనే ఎక్కువ ఉండొచ్చని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్