వైసీపీకి మరో ఎదురు దెబ్బ..ఎన్నికలకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలన్న నిర్ణయాన్ని తిరస్కరించిన ఈసి

Spread the love
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20:

ఏపీ సీఎంజగన్ తీసుకున్న నిర్ణయం బాగుందని.. ఒకవైపు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఇది ఏ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమైనా.. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మారుతుందని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దుకున్నారు. అయితే.. అంతా అనుకున్నట్టు జరిగితే ఇబ్బంది ఉండేది కాదు. కానీ… అలా జరగలేదు. రివర్స్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తిప్పికొట్టిందని సమాచారం.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లలో కూర్చుని.. ఓటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు కొన్ని దశాబ్దాలుగా టీచర్ల సేవలను వినియోగిస్తున్నారు.
అదేసమయంలో ఇతర విభాగాల కు చెందిన ఉద్యోగులను కూడా వాడుకుంటున్నారు. వీరికి ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉంచి రోజుకు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రూ.1500 వేతనంగాను రూ.400 ఇతర అలవెన్సులుగాను ఇస్తున్నారు.
అయితే తమకు ఎన్నికల విధులు వద్దని.. కొన్నాళ్లుగా ఏపీలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ ఎన్నిక లసమయంలో మాత్రం.. ఆయా విధులు నిర్వహించేందుకు అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్న వారు కావాలి. పైగా చదువుకున్న వారే అవసరం. ఇంత మందిని సమకూర్చడం అంటే ఏ ప్రభుత్వానికి సాధ్యంకాదు. అందుకే.. వారు వద్దన్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయులనే ఈ విధులకు కేటాయిస్తున్నారు.
ఇక ఏపీలో ఇటీవల జగన్ ప్రషభుత్వం వీరిని ఆ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని.. ఈ క్రమంలో వారికి ఎన్నికలవిధులు అప్పగిస్తే.. తమ పుట్టి ముంచుతారని భావించిన వైసీపీ సర్కారు.. వారి డిమాండ్నే అడ్డు పెట్టుకుని.. స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్టుగా పక్కన పెట్టింది. ఇదే నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది.
అయితే.. అక్కడి అధికారులు.. ‘ఇలా కుదరదు. ఉపాధ్యాయుల సేవలను భర్తీ చేయగల యంత్రాంగం ఈసీ దగ్గరలేదు. సో.. వారినే ఎన్నికల విధులకు కేటాయించాలి” అని తిరుగు టపాలో సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అయితే..యధాలాపంగా.. వైసీపీ సర్కారు ఈ ఆదేశాలను కూడా తొక్కి పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్