మాజీ మంత్రి శంకర్ నారయణ పై క్యాడర్ తీవ్ర వ్యతిరేకత..చివరికి టికెట్ కే ఎసరు పెడుతుందా..?

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 19:

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం పెనుకొండ. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న మాలగుండ్ల శంకర నారాయణకు ఇప్పుడు ఫుల్లుగా వ్యతిరకత కనిపిస్తోంది. అసలు ఆయనకు టికెట్ ఇవ్వడానికి కూడా వీల్లేదన్న రీతిలో తాజాగా హంగామా సృష్టించారు కార్యకర్తలు. అయితే.. ఇక్కడ అసలు రీజన్ ఏంటంటే.. మాలగుండ్ల శంకరనారాయణ తమకు అసలు అందుబాటులోనే ఉండడం లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఈ పరిణామాలకు తోడు తీవ్ర అవినీతి ఆరోపణలు సైతం ఆయన కుటుంబాన్ని వెంటాడుతున్నారు. తన కోసం పనిచేసిన వారిని ఆయన పట్టించుకోకపోవడం.. కనీసం డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా లేకుండా.. పోవడం వంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాస్తవానికి శంకర నారాయణ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అప్పట్లోనే ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడ కొందరు చక్రం తిప్పారు.ఆయనను నియోజకవర్గంలోకి కూడా రానివ్వబోమంటూ.. కొందరు నేతలు తెగేసి చెప్పారు. అప్పట్లోనే ఆయన అలెర్ట్ అయి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కానీ ఆయన అప్పట్లో లైట్ తీసుకున్నారు. ప్రతి విషయాన్ని.. కూడా తనకు సంబంధం లేదని.. ఎగస్పార్టీవాళ్లు ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వచ్చారు. ఫలితంగా ఇప్పుడు మరింత తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది.

ఇది ఇప్పుడు సరిచేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందనేది తాజాగా జరిగిన పరిణామాలను బట్టి ఇట్టే అర్ధమవుతోంది. కనీసం ఇప్పటికైనా నియోజకవర్గం అభివృద్ధి పై దృష్టి పెడితే తప్ప.. అసలు గెలిచే పరిస్థితి లేదని శంకరనారాయణ ఉదంతం కళ్లకు కడుతోంది. ఇక తాజాగా కార్యకర్తలు చెప్పులు చూపించిన ఘటనపై అధిష్టానం కూడా సీరియస్గానే ఉందని తెలుస్తోంది. మరి చివరకు టికెట్ దక్కుతుంందో లేదో చూడాలి.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్