
జన సముద్రం న్యూస్,డిసెంబర్ 19,అనంతపురం:
ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు టివి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే గ్రామసభల నిబంధనల ప్రకారం షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అల్తాఫ్ మాట్లాడుతూ జనవరి 2వ తేదీన జరగవలసిన గ్రామసభల నిర్వహణ గురించి ఎన్ని వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నది. గ్రామసభల షెడ్యూల్స్ ఇంతవరకు పంచాయితీలలో ప్రకటించలేదు,ఎలాంటి ప్రచారం చేయకుండా మొక్కుబడిగా నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు

. గ్రామసభలు సక్రమ నిర్వాహణ కోసం ఈ నెల 20 నుండి 24 వరకు జిల్లా,మండల స్థాయిలలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని,అలాగే గ్రామసభలపై అవగాహన కల్పిస్తూ,ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశం తీర్మానించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం.సాంబశివుడు.కె. సుబ్బరాయుడు ,మండల నాయకులుకె. ఓబులపతి, సోమార రాహుల్ ,కె.రామకృష్ణ , యస్ .ఫణి భూషణ్ ,బద్దెల.మంజునాథ్ బాలకృష్ణ ,ఆర్ శ్రీనివాసులు తో పాటు వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు






