వైసీపీ ఓడిపోతే నష్టపోయేది పేద ప్రజలే..ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్న సీఎం జగన్..!

Spread the love
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17:

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యూహాన్ని మరింత వేగం పెంచేందుకు జగన్ అనేక రూపాల్లో ప్రయ త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో పేదలకు పెత్తందా ర్లకు మధ్య యుద్ధం జరుగుతోందని ఈ యుద్ధంలో వైసీపీ ఓడిపోతే.. నష్టపోయేది పేదలేనని ఆయన వ్యాఖ్యానించారు.

నిజానికి పేదలు.. ఉన్నారు సరే!  మరి పెత్తం దార్లు ఎవరు?  టీడీపీ జనసేన బీజేపీలేనా?  ఈ జాబితాలో వైసీపీ రాదా? అనేది ప్రధాన ప్రశ్న అత్యంత ధనిక పార్టీల్లో వైసీపీ కూడా ఉందని ఇటీవల ఓ సంస్థ వెల్లడించిన జాబితానే ఉంది. దీనిని బట్టి వైసీపీ కూడా పెత్తందారు పార్టీ కాదా? అనేది సగటు పౌరుడి ప్రధాన ప్రశ్న. పేదల కోసమే ఈ పార్టీ ఉందని అనుకుంటే.. రాష్ట్రంలో ఉన్న పేదల తలరాతలు మార్చేందుకు ఈ మూడున్నరేళ్లలో చేసింది ఏంటి? అనేది మరో కీలక సందేహం.
ఎందుకంటే.. కేవలం డబ్బులు పంచుకుంటూ పోయినా.. వారి జీవితాల్లో మెరుగు కనిపించాలి.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే.. 4 లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచారు. మరి వారి జీవితాల్లో మార్పు కనిపించిందా?  వారు సంపన్నుల జాబితాలోకి కాకపోయినా.. మధ్యతరగతి జాబితాలోకి అయినా .. వచ్చారా? అనేది ప్రశ్న. కానీ లేదు.
పోనీ.. తమది పేదల పార్టీఅనుకుంటే.. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ వ్యాపార వ్యవహరాలు..ఆస్తులు బహిర్గతం చేసి.. తమది పేదల పార్టీ అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మొత్తం గా చూస్తే.. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నంగా ఉంది తప్ప..  ఇది ఆచరణలోనూ.. వినేందుకు కూడా ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్