రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యూహాన్ని మరింత వేగం పెంచేందుకు జగన్ అనేక రూపాల్లో ప్రయ త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో పేదలకు పెత్తందా ర్లకు మధ్య యుద్ధం జరుగుతోందని ఈ యుద్ధంలో వైసీపీ ఓడిపోతే.. నష్టపోయేది పేదలేనని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి పేదలు.. ఉన్నారు సరే! మరి పెత్తం దార్లు ఎవరు? టీడీపీ జనసేన బీజేపీలేనా? ఈ జాబితాలో వైసీపీ రాదా? అనేది ప్రధాన ప్రశ్న అత్యంత ధనిక పార్టీల్లో వైసీపీ కూడా ఉందని ఇటీవల ఓ సంస్థ వెల్లడించిన జాబితానే ఉంది. దీనిని బట్టి వైసీపీ కూడా పెత్తందారు పార్టీ కాదా? అనేది సగటు పౌరుడి ప్రధాన ప్రశ్న. పేదల కోసమే ఈ పార్టీ ఉందని అనుకుంటే.. రాష్ట్రంలో ఉన్న పేదల తలరాతలు మార్చేందుకు ఈ మూడున్నరేళ్లలో చేసింది ఏంటి? అనేది మరో కీలక సందేహం.
ఎందుకంటే.. కేవలం డబ్బులు పంచుకుంటూ పోయినా.. వారి జీవితాల్లో మెరుగు కనిపించాలి.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే.. 4 లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచారు. మరి వారి జీవితాల్లో మార్పు కనిపించిందా? వారు సంపన్నుల జాబితాలోకి కాకపోయినా.. మధ్యతరగతి జాబితాలోకి అయినా .. వచ్చారా? అనేది ప్రశ్న. కానీ లేదు.
పోనీ.. తమది పేదల పార్టీఅనుకుంటే.. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ వ్యాపార వ్యవహరాలు..ఆస్తులు బహిర్గతం చేసి.. తమది పేదల పార్టీ అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మొత్తం గా చూస్తే.. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నంగా ఉంది తప్ప.. ఇది ఆచరణలోనూ.. వినేందుకు కూడా ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.