టీచర్లను వదలని వైసీపీ సర్కార్..ఏపి లో ఉపాధ్యాయులకు అదర్ ద్యూటి సెలవలు కట్..!

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6:

వేధింపులకు రంగు రూపం రుచి ఉండదన్నట్టుగా.. ఏ రూపంలో అయినా ఉంటాయి. సమయానికి రాకపోయి నా.. ముందుగానే వెళ్లిపోయినా.. సెలవు పెట్టినా..వేధించాలని అనుకున్నప్పుడు.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని అనుకున్నప్పుడు.. కారణాలతో పనిలేదు.. కారణాన్ని వెతకాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ప్రతి దానినీ కారణంగానే మలుచుకునే అవకాశం ఉంది. ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది.

ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయాలని భావించిన సర్కారు… ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకు లకు.. అదర్ డ్యూటీ(ఓడీ) సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సెలవులు లేకుండా చేసింది.అంటే.. ఉద్యోగుల తరఫున సంఘాలుగా ఏర్పడే నాయకులు వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం చుట్టూ తిరిగేందుకు వారు సెలవులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారి వేతనం కట్ కాదు. కానీ ఉపాధ్యాయ నేతలకు మాత్రం దీనిని తీసేశారు

ఇక ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయుల వేతనాల విషయంలోనూ.. ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంద నే వాదన వినిపిస్తోంది. అంటే.. అందరికీ ఇచ్చి.. ఉపాధ్యాయులకు మాత్రం చాలా ఆలస్యం చేస్తోందని అంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా.. ఉద్యోగులకు నెలలో 5 లేదా 10వ తారీకు నాటికి వేతనాలు మంజూరు చేస్తోంది.కానీ ఉపాధ్యాయులవిషయానికి వస్తే మాత్రం అందరూ అయిన తర్వాత.. నిధులు ఉంటే వేయడం లేక పోతే.. వచ్చే వరకు వెయిట్ చేయడం అనే పంథాను ఎందచుకుంది. దీంతో ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. ఇదేం ఖర్మ.. అని తమలో తాము తిట్టుకుంటున్నారు.

గురు బ్రహ్మ.. అంటూ విద్యార్థులు తెల్లారిలేస్తే.. స్మరించుకునే గురువుల విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. వారు తమ డిమాండ్లపై పోరాటం చేశారనో.. లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రం తిప్పారనో.. లేక.. తమ ఆదేశాలను కూడా కాదని మిలియన్ మార్చ్ను నిర్వహించారనో.. లేక.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారనో.. ఇలా కారణం ఏదో ఏదైనా కానీ.. ఇప్పుడు గురువులపై మాత్రం వైసీపీ ప్రభుత్తం బెత్తం ఝళిపిస్తోంది.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్