ఆత్మకూరు, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా:
08.12.2022 గురువారం ఉ॥ 8.00 గం॥ల నుండి వైద్య శిబిరం ప్రారంభం..!
స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరు.
ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్లద్దాలు, లెన్స్ పంపిణీ..!
ఆత్మకూరులో ఇటీవల నిర్వహించిన వైద్య శిబిరంలో ఎంపికైన వారికి బెంగళూరులో కంటి ఆపరేషన్లు చేశారు వారందరికీ రేపు (గురువారం) రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా కళ్లద్దాలు, లెన్స్ పంపిణీ చేస్తారు.
సూచనలు
కంటిలో శుక్లములు ఉన్నవారికి కంటి పరీక్షలు. ఆపరేషన్లు పేదవారికి పూర్తిగా ఉచితం. ఈ శిబిరం ద్వారా కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వబడను..!
శిబిరములో కంటి చికిత్సలు చేసి ఆపరేషన్ అవసరమైన వారికి అదేరోజు బెంగళూరుకు తీసుకెళ్ళి శంకర కంటి ఆసుపత్రి నందు కంటి ఆపరేషన్లు చేయించి తిరిగి ఆత్మకూరుకు ఉచితముగా చేర్చబడను..!
కంటి నిపుణుల సలహాలతో, కళ్ళలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడను. ఆపరేషన్ల కొరకు వెళ్ళిన వారికి బెంగళూరులో భోజనం, వసతి సౌకర్యములు ఉచితముగా కల్పించబడను..!
శిబిరమునకు వచ్చువారు స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి రావాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి..!
కంటి పరీక్షలు, ఆపరేషన్లకు అవసరమగు వారు ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబరు, రెండు రేషన్ కార్డు, రెండు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలు తప్పకుండా తీసుకొని రావలెను.
గతనెలలో కంటి పరీక్షలకు హాజరై అనివార్య కారణాల వలన కంటి ఆపరేషన్లకు వెళ్ళని వారికి మళ్ళీ టెస్టులు నిర్వహించి ఆపరేషనుకు తీసుకొని వెళతారు. ఏ కారణాల వల్లనైనా గతనెలలో కంటి వైద్య శిబిరానికి హాజరు కాలేకపోయిన వారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించబడును.
చిన్న పిల్లలకు, వికలాంగులకు ప్రాధాన్యత కల్పించబడను.
శంకర కంటి ఆసుపత్రి, వర్తూరు మెయిన్ రోడ్డు, కుందలహళ్ళి గేట్, బెంగళూరు – 5600375
ఫోన్ : 080-69038900, 690389000 -01-02 -03.