సీఎం జగన్ రాజకీయ నేపథ్యంతో రామ్ గోపాల్ వర్మ ప్యుహం సినిమా..!

Spread the love
జనసముద్రం న్యూస్ ,డిసెంబర్ 07:

ఏపీ సీఎం జగన్ రాజకీయ నేపథ్యమే కథాంశంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మిస్తున్న చిత్రం “వ్యూహం”!

ఈ సినిమాలో ఎన్నో సంచలనాత్మక అంశాలు దాగుంటాయట.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్లో మరణించిన తరువాత రాజకీయంగా పన్నిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఆసక్తికరంగా చిత్రీకరించే పనిలో పడ్డారట దర్శకుడు ఆర్జీవీ.
హిట్టా…ఫట్టా అనేదానితో సంబంధం లేకుండా తాను తీసే ప్రతి సినిమాను ఒక సంచలనంగా మార్చగల నైపుణ్యం ఒక్క ఆర్జీవీకే సొంతం. ఆయన ఏం చేసినా ఒక సంచలనమవుతూ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంటుంది. తాజాగా ఆయన వై.ఎస్.జగన్ పైన ఒక సినిమా నిర్మించడానికి పూనుకుని సంచలనం సృష్టించారు. ఈ సినిమాపై ఇప్పటికే పలు రకారల ప్రచారాలు సాగాయి. ఇది జగన్ బయోపిక్ అని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాలను ఆర్టీవీ కొట్టి పారేశారు కూడా. కచ్చితంగా ఇది వై.ఎస్.జగన్కు సంబంధించిన చిత్రమేనని అయితే ఇందులో ఆయన ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు అలాంటి విషయాలేమీ ఉండబోవడం లేదన్నారు. ఇది కేవలం రాజకీయ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమాగా చెప్పుకొచ్చారు.
ఈ సినిమా మొత్తం జగన్ జరిపిన పొలిటికల్ ఫైట్ చుట్టూనే తిరిగేలా కథ రూపొందించారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ జనవరి నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇందులో వై.ఎస్.ఆర్ మరణం తదుపరి జగన్ కేసులతో జైలుపాలుకావడం జగన్ జరిపిన పోరాటం తరువాత ఆయన సీఎం అయ్యే వరకు అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఆర్జీవీ చెబుతున్నారు.  
అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి  నెలకొంది. జగన్ను ఆర్జీవీ తెరపైన ఎలా చూపించబోతున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్