బీసీలను నట్టేట ముంచిన ఏకైక ప్రభుత్వం వైకాపా.

Spread the love

✦కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్.

✦రాష్ట్రంలో 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం.

✦బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఆర్థికంగా బీసీలను అనగదొక్కిన జగన్.

✦డిసెంబర్ 8న వైకాపా బీసీ సమావేశంలో బీసీలకు ఏం చేశావని సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి.

✦బీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్పొరేషన్లు ఫుల – నిధులు నిల్ కార్యక్రమంలో మాజీ మంత్రి కాలువ,మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం,జితేంద్ర గౌడ్,వడ్డే వెంకట్,టిడిపి నాయకులు

జనసముద్రం న్యూస్:నవంబర్,28.జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:

అనంతపురం న్యూస్: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని అనంతపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు,మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠ ప్రభాకర్ చౌదరి,జితేంద్ర గౌడ్ టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ లు విమర్శించారు.సోమవారం ఉదయం అనంతపురం నగరం లోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా టిడిపి బీసీ సెల్ ఆధ్వర్యంలో కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్ అనే కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా టిడిపి బిసి నాయకులతో కలిసి వడ్డే వెంకట్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వడ్డే వెంకట్ మాట్లాడుతూ నిధులు,విధులు లేని పదవులు బీసీలకు అప్పజెప్పి రాజభోగాలు వున్న పదవులు రెడ్లకు కట్టబెట్టిన ఘనత జగన్ రెడ్డిది అని,తెదేపా హాయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయలు వరకు లబ్ది చేకూరేదని ఇప్పుడు జగన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ మొత్తానికి కేవలం 2 లక్ష రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో పప్పులు,బెల్లాలు పంచుకోవాలా అని ఎద్దేవా చేశారు.బీసీలకు విదేశీ విద్య ద్వారా బీసీ విద్యార్థుల ఉన్నతకి నారా చంద్రబాబు నాయుడు చేయూతను అందించారని తెలిపారు.బీసీలను 26 మందిని ఊచకోత కోసి పొట్టన పెట్టుకుని 2650 మంది బీసీ నాయకులు పై అక్రమ కేసులు పెట్టించి,ఆస్తులు ధ్వంసం చేయ్యించి బీసీలకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు బీసీల సభ అంటూ ఓట్ల కోసం బీసీలను మోసం చేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని వడ్డే వెంకట్ ఘాటుగా విమర్శించారు.టిడిపి బీసీ రాష్ట్ర నాయకులైన మాజీ మంత్రులు అచ్చం నాయుడు,యనమల రామకృష్ణుడు,అయ్యన్న పాత్రుడు,కొల్లు రవీంద్ర మరియు మహిళా నాయకులు గౌతు శిరీష,భవాని,పంచుమర్తి అనురాధ,తదితరులపై అక్రమంగా కేసులు పెట్టించి వేధించిన చరిత్ర మీది కాదా జగన్మోహన్ రెడ్డి,డిసెంబర్ 8న వైకాపా బిసి సమావేశంలో ఈ రాష్ట్ర బీసీలకు ఏమని సమాధానం చెప్తావు.?జగన్మోహన్ రెడ్డి అని వడ్డే వెంకట్ ప్రశ్నించారు.నామినేటెడ్ పదవులన్నీ మీ వర్గానికి కట్టబెట్టి డమ్మీ పదవులు బీసీలకు కేటాయించానని చెబుతావా,56 కార్పొరేషన్లను కు నిధులు విధులు,కేటాయించకుండా పూర్తిగా నిర్వీర్యం చేశావని చెప్తావా ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వైకాపా బీసీ సభ నిర్వహిస్తారో సమాధానం చెప్పాలని వడ్డే వెంకట్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు,టిడిపి నాయకులు ఆలం నరసానాయుడు,వెంకట శివుడు,యాదవ్,ఆది నారాయణ,వెంకటాపురం నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు