ఘోర ప్రమాదానికి గురైన అయ్యప్ప స్వాముల బస్సు..20 మందికి తీవ్ర గాయాలు

Spread the love

అయ్యప్పస్వామి మాలలు ధరించిన భక్తులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లడంతో 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచీ అయ్యప్పమాల లు వేసుకున్న భక్తుల బృందం బస్సులో శబరమిలైకి బయలుదేరింది.  వారు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం తెల్లవారు జామున ఒంగోలుకు సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో 20 మంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఒంగోలు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న టిప్పర్పైకి దూసుకెళ్లి దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు ముందు బాగం నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ఈ ప్రమాదానికిగల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. క్షతగాత్రులందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్