అయ్యప్పస్వామి మాలలు ధరించిన భక్తులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లడంతో 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచీ అయ్యప్పమాల లు వేసుకున్న భక్తుల బృందం బస్సులో శబరమిలైకి బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం తెల్లవారు జామున ఒంగోలుకు సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో 20 మంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఒంగోలు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న టిప్పర్పైకి దూసుకెళ్లి దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు ముందు బాగం నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ఈ ప్రమాదానికిగల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. క్షతగాత్రులందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!
Spread the love అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ జనవరి 3 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ఓబుళవారిపల్లి పల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెరైటీస్ ఖనిజం లభిస్తున్నది…