ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు..

Spread the love

తాత ఆశయాలను కొనసాగిస్తా
ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తా..

జనసముద్రం న్యూస్ జూలై 25 హుజురాబాద్

స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 14 వర్ధంతిని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు,ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా అనేక సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని,వారి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని,ఆనాటి ప్రధానమంత్రి పి.వీ.నరసింహరావుకు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేసి రాజకీయ చతురత ప్రదర్శించారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్య,వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు.అనంతరం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు,అభిమానులు,నాయకులతో,కార్యకర్తలతో కలిసి ప్రణవ్ భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వర రావు అభిమానులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి