
( జనసముద్రం న్యూస్ ప్రతినిధి హుస్సేన్)
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో పాలకుర్తి నియోజకవర్గం లోనీ అన్ని మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని,దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పాలకుర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మరియు టి పి సి సి వైస్ ప్రెసిడెంట్ అండ్ పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి .
ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకోవాలని,వర్షాకాలం వలన విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున,ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు.బుధవారం రోజున మాట్లాడి తగిన సూచనలు చేశారు.రైతులు వ్యవసాయానికి వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని,కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ కోరారు.