
జనసముద్రం న్యూస్ హుజురాబాద్ జూలై 25
కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, కల్లెపల్లి రమాదేవి రోశెందర్, గని శెట్టి ఉమామహేశ్వర్, కొండ్ర నరేష్, మక్క పల్లి కుమార్, ప్రతాప కృష్ణ, ఇమ్రాన్, కొయ్యడ శ్రీదేవి, కమలాకర్ , చంద గాంధీ ,కేసరి మధుకర్ రావు, బత్తుల సమ్మయ్య, మోరె మధు, దిల్ శ్రీనివాస్, కత్తెరసాల సదానందం, ముశం అశోక్, లింగమూర్తి, మ క్కపల్లి రమేష్ ,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.