
( జనసంద్రం న్యూస్ ప్రతినిధి హుస్సేన్ )
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్
కోరుట్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినారు. కోరుట్ల నియోజకవర్గం లోని చెడిపోయిన రోడ్లు, మురికి కాలువలు, కల్లూరు వాగు,కోరుట్ల సంఘం వాగు యామాపూర్, ఫకీర్ కొండాపూర్ వాగులపై
వెంటనే బ్రిడ్జిలు నిర్మాణం పనులను చేపట్టాలని అలాగే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని నియోజకవర్గంలో ప్రతి పౌరుడు చెట్లు నాటాలని పచ్చదనం పరిశుభ్రత కాపాడాలని నియోజకవర్గంలోని అర్హులందరికి రేషన్ కార్డ్ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నియోజకవర్గంలో ఉర్దూ మీడియం స్కూల్స్ అభివృద్ధి చేయాలని కోరుట్ల నియోజకవర్గంలో ప్రధాన రహదారులపై పలుచోట్ల మూలమలుపులో ప్రమాదకరంగా ఉన్నాయని వాహనదారులను అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుట్ల వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి జాగ్రత్తలు పాటించాలని నియోజవర్గంలోని వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని
కోరుట్ల మద్దుల చెరువును మరో ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని కోరుట్ల తాహసిల్దార్ కార్యాలయ భవనం పిల్లర్ల దశలో నిలిచిన భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి,జిల్లా కలెక్టర్, స్పందించి వేంటనే సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని ప్రవీణ్ కుమార్ కోరినారు కార్యక్రమంలో దేశం నాయకులు రాజ గణేష్, పాతర్ల విజయ్, ఎండి రఫీఉద్దీన్, మహాదేవ్, బాలే మారుతి, ఎనుగందుల శ్రీనివాస్, ఎండి షాదుల్లా, చందు, మాధవరెడ్డి, రాజేందర్ తెలుగు యువత నాయకులు నదీమ్, సిద్దు, సందీప్, ఆసిఫ్
తెలుగు మహిళ నాయకురాలు కే దివ్య, జ్యోతి, పద్మ, మాల శ్రీ, శాంత,అంజలి, విజయ, కళ్యాణి, లీల,తదితరులు పాల్గొన్నారు.