
జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 2 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల గ్రామంలో తూర్పు వీధిలో వెలిసియు ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లొ ప్రతి సంవత్సరం శ్రీ ఆంజనేయస్వామి జయంతి నిర్వహిస్తారు స్వామివారికి రథోత్సవం మంగళవారం నాడు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హనుమంతుని రథోత్సవాన్ని నిర్వహించారు స్వామి రథోత్సవం ఆలయం నుండి ప్రారంభమై ద్వారకాతిరుమల పురవీధుల్లో సాగింది ముందుగా రధాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు సన్నాయి మేళాలతో అంగరంగ వైభవంగా భక్తుల కోలాహరం నడుమ రథోత్సవం జరిగింది