
పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
జనసముద్రం న్యూస్ నరసరావుపేట (బ్యూరో) జూన్ 24.
పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హౌసింగ్ కాలనీల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి పనుల ప్రగతిని వివరించారు.జిల్లాలో పనుల తనిఖీ కోసం 18 బృందాలను ఏర్పాటు చేయగా, మొత్తం 741 పనుల్లో ఇప్పటివరకు 277 పనుల తనిఖీ మాత్రమే పూర్తయిందని, మిగిలిన 464 పనుల తనిఖీని వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు పారదర్శకంగా నిర్వహించి, పూర్తయిన అన్ని పనులకు సంబంధించిన నివేదికను ఒక వారంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు సమర్పించాలని సూచించారు.ఈ సమావేశంలో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జే. ప్రభాకర్, తనిఖీ బృందాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.