
ఒక కేసు నుంచి తప్పించుకున్నా
వెంటాడు తున్న మరో కేసు ??
*అప్పట్లో పనిచేసిన మేనేజర్ ,కమిషనర్‌పై చర్యలు ?
జనసముద్రం న్యూస్ చిలకలూరిపేట (బ్యూరో) జూన్ 24.
చిలకలూరిపేట మున్సిపాలిటీలో సంచనలం రేకిత్తించిన కుంబకోణంలో 10 ఉద్యోగులు సస్పెండ్ కు గురికావడం, పలువురు ఉన్నతాధికారులు శాఖ పరమైన విచారణకు ఆదేశించటం తెలిసిందే. ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని చేసిన తప్పుకు ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో దుర్వినియోగం అయిన నగదును తిరిగి మున్సిపాలిటీకి చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగులు, అధికారులు ఈ వ్యవహారం నుంచి బయట పడే అవకాశం ఉంది. అయితే మరో కుంబకోణంలో అప్పట్లో విధులు నిర్వహించిన షరాఫ్, మున్సిపల్ మేనేజర్, కమిషనర్ పై క్రిమినల్ చర్యలు తప్పేలా లేవు. ఈ అంశంపై ప్రస్తుతం చిలకలూరిపేట మున్సిపాలిటీలో చర్చ కొనసాగుతుంది.
ఈ అవినీతిపై అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవా…?
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐ. గంగాభవాని రూ.34,34,397లను నకిలీ రశీదుల ద్వారా దుర్వినియోగం చేసినట్లు గుర్తించబడింది. ఈ మొత్తం నుండి రూ.12,94,024/-ను తిరిగి చెల్లించినప్పటికీ మిగిలిన రూ.21,40,373లు ఇంకా వసూలు కావాల్సి ఉంది. జమచేసినట్లు తెలిసింది. ఈ అవినీతి ఇలా ఉంటే జూనియర్ అసిస్టెంట్ షరాఫ్‌గా పనిచేసిన ఉద్యోగం రూ.13,67,185లను బ్యాంకులో జమచేయకుండా దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించారు. రూ. 6లక్షల వరకు మున్సిపాలిటీ చెల్లించినట్లు తెలిసింది. అయితే అప్పట్లో విధులు నిర్వహించిన మేనేజర్, కమిషనర్‌పై కూడా చర్యలు తప్పేలా లేవు. ఈ వ్యవహారంలో దుర్వినియోగం అయిన నగదును చెల్లించకపోతే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఒక కేసు నుంచి బయట పడినా వీరిని మరో కేసు వెంటాడటం విశేషం