
జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 24
చిలమత్తూరు మండలంలో సెజ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోవడం,మళ్లీ భూసేకరణ చేయడం అన్యాయమని సిపిఎం మండల కమిటీ, రైతులు తహశీల్దార్‌కి వినతిపత్రం సమర్పించారు.వీరాపురంలోని వలస పక్షుల నివాస భూములను మినహాయించాలని,అనుమతి లేకుండా కొత్త భూములు సేకరించడం ఆపాలని, ఇప్పటికే సేకరించిన భూముల్లో పరిశ్రమలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.