
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి జూన్ 24. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో 40 లక్షల రూపాయలతో గ్రామ ప్రజల పదేళ్ల కలను సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి నిర్మాణం జరుగుతున్న సిసి రోడ్లను డివిజన్ ఇంజనీర్ అధికారి సీతయ్య మండల ఇంజనీరింగ్ అధికారి వెంకటేశ్వర్రావు సోమవారం పరిశీలించారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంటాక్ట్ ని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పోలిన శ్రీను గ్రామ ఎంపీటీసీ సభ్యులు కొయ్యలమూడి వెంకట సరిత రామ్మోహన్రావు గ్రామ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు పార్టీ సీనియర్ నాయకులు ఆచంట సత్యనారాయణ గరిమెళ్ళ రాంబాబు కానుమిల్లి విష్ణు ఏ ఊరికి షోరు గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పద్మ తదితరులు పాల్గొన్నారు