
కదిరి, జన సముద్రం న్యూస్, జూన్ 24:-
భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ అధ్యక్షతన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అఖండ భారతదేశం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషి,ఆయన పడిన తపన గురించి వివరిస్తూ దేశం కోసం ఆయన ప్రాణాల్ని బలిదానం చేయడం గర్వకారణంగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సామల కేశవరెడ్డి, సీనియర్ నాయకులు తేపల్లె రామకృష్ణ,జిల్లా కార్యదర్శి ఇడగొట్టు అశోక్ కుమార్,మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు బార్ ఇంతియాజ్,కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి షేక్ సమివుల్లా,మాజీ పట్టణ అధ్యక్షులు కొత్త రమేష్ బాబు,నందిశెట్టి బాబు, వేణుగోపాల్ రెడ్డి,ఎస్వి చలపతి,మూడే గణేష్ నాయక్,వెంకటేష్ నాయక్,అంజి,శ్రీను,వెంకటేష్,తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.