మున్సిప‌ల్ అధికారుల‌కు క్రిమిన‌ల్ కేసులు త‌ప్ప‌వా*?…

Spread the love

ఒక కేసు నుంచి త‌ప్పించుకున్నా
వెంటాడు తున్న మ‌రో కేసు ??

*అప్ప‌ట్లో ప‌నిచేసిన మేనేజ‌ర్‌ ,క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు ?

జనసముద్రం న్యూస్ చిలకలూరిపేట (బ్యూరో) జూన్ 24.

చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీలో సంచ‌న‌లం రేకిత్తించిన కుంబ‌కోణంలో 10 ఉద్యోగులు స‌స్పెండ్ కు గురికావ‌డం, ప‌లువురు ఉన్న‌తాధికారులు శాఖ ప‌ర‌మైన విచార‌ణ‌కు ఆదేశించ‌టం తెలిసిందే. ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని చేసిన త‌ప్పుకు ఉద్యోగుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే ఈ వ్య‌వ‌హారంలో దుర్వినియోగం అయిన న‌గ‌దును తిరిగి మున్సిపాలిటీకి చెల్లించిన‌ట్లు తెలిసింది. దీంతో ఉద్యోగులు, అధికారులు ఈ వ్య‌వ‌హారం నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది. అయితే మ‌రో కుంబ‌కోణంలో అప్ప‌ట్లో విధులు నిర్వ‌హించిన ష‌రాఫ్‌, మున్సిప‌ల్ మేనేజ‌ర్, క‌మిష‌న‌ర్ పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్పేలా లేవు. ఈ అంశంపై ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీలో చ‌ర్చ కొన‌సాగుతుంది.

ఈ అవినీతిపై అధికారుల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వా…?

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐ. గంగాభవాని రూ.34,34,397ల‌ను నకిలీ రశీదుల ద్వారా దుర్వినియోగం చేసినట్లు గుర్తించబడింది. ఈ మొత్తం నుండి రూ.12,94,024/-ను తిరిగి చెల్లించిన‌ప్ప‌టికీ మిగిలిన రూ.21,40,373లు ఇంకా వసూలు కావాల్సి ఉంది. జ‌మ‌చేసిన‌ట్లు తెలిసింది. ఈ అవినీతి ఇలా ఉంటే జూనియర్ అసిస్టెంట్‌ ష‌రాఫ్‌గా ప‌నిచేసిన ఉద్యోగం రూ.13,67,185ల‌ను బ్యాంకులో జ‌మ‌చేయ‌కుండా దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించారు. రూ. 6ల‌క్ష‌ల వ‌ర‌కు మున్సిపాలిటీ చెల్లించిన‌ట్లు తెలిసింది. అయితే అప్ప‌ట్లో విధులు నిర్వ‌హించిన మేనేజ‌ర్, క‌మిష‌న‌ర్‌పై కూడా చ‌ర్య‌లు త‌ప్పేలా లేవు. ఈ వ్య‌వ‌హారంలో దుర్వినియోగం అయిన న‌గ‌దును చెల్లించ‌క‌పోతే అధికారులపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం ఉంది. ఒక కేసు నుంచి బ‌యట ప‌డినా వీరిని మ‌రో కేసు వెంటాడ‌టం విశేషం

  • Related Posts

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    Spread the love

    Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!