
రాయచోటి జనసముద్రం న్యూస్ జూలై 2
లయన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘనంగా సన్మానించడం జరిగిందని అధ్యక్షులు లయన్ పి.శ్యామ్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతూ నిరంతరం విశేష సేవలు అందిస్తున్న వైద్యులను సన్మానించుకోవడం గర్వకారణమని తెలిపారు.
అనంతరం ప్రముఖ వైద్యులు డా.బయారెడ్డి మాట్లాడుతూ డా.బీసీ రాయి జన్మదినం మరియు వర్ధంతి సందర్భంగా వారు రాజకీయంగా మరియు వైద్య పరంగా ప్రజలకు ఎంతో సేవ చేశారని వారి సేవల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జులై 1 వ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఇలాంటి మహనీయులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అలాగే విద్యార్థిని విద్యార్థులు యోగ మరియు ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థినీ విద్యార్థులు మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని గొప్ప స్థాయిలో ఉండి మీ తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని తెలిపారు.
అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ పి.యస్.హరినాథ్ రెడ్డి,రీజనల్ చైర్మన్ లయన్ షేక్.మహమ్మద్,సీనియర్ లయన్ సభ్యులు లయన్ నారాయణ రెడ్డి గార్లు మాట్లాడుతూ వైద్యులు మనకు కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళని వారిని మనం గౌరవించాలని అలాగే విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని తమకు తోచినంత ప్రజలకు సేవ చేయాలని తెలిపారు వైద్యులు రమాదేవి,బయారెడ్డి,లయన్ నారాయణ రెడ్డి,లయన్ అరుణ్ కుమార్ ,లయన్ భరత్ కుమార్,మాధవిలత,ఉషారాణి లను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు లయన్ పి.శివారెడ్డి,కార్యదర్శి లయన్ షేక్.ఇందాద్ అహ్మద్,లయన్ అంజి రెడ్డి సాయి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.