
జనసముద్రంన్యూస్, జూలై 2 ;
నెల రోజులు గడిచినా పనికి ఆహార పథకం డబ్బులు అందలేదని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామస్తులు వాపోతున్నారు. నెలక్రితమే అందవలసిన పనికి ఆహారం పధకం కి సంభందించిన కూలి డబ్బులు నెల గడిచిపోయినప్పటికీ ఇంకా ఇవ్వలేదని, వర్షాలు పడక పొలాల్లో పనులు లేక రోజులు గడవక చాలా ఇబ్బంది పడుతున్నామని, 2 వారాల డబ్బులు మమాత్రమే చెల్లించారని మిగిలిన వారాలకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా రోజులు గడుపుతున్నారని బొల్లాపల్లి మండలం, రావులాపురం గ్రామస్తులు తెలిపారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రజలకు రాకుండా చూడాలని, వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి వినుకొండ నియోజక వర్గంలోని అన్ని మండలాల గ్రామాల ప్రజలకు వారి కూలి డబ్బులు అందేలా తగు చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా గౌరవ శాసన సభ్యులు, చీప్ విప్ జీ వి ఆంజనేయులు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ పులిమల రూబెను కోరుతున్నారు.