
గ్రామపంచాయతీలలో ప్రత్యేక క్యాంపు ల ద్వారా ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి….
……జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి జనసముద్రం న్యూస్, జూలై 02:
జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సమ్మిళితత్వం కోసం విస్తృత ప్రచారం చేయాలని జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక సమ్మిళితత్వం పై గోడపత్రికను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం సాయంత్రం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రచార కార్యక్రమాలను ప్రతి గ్రామ పంచాయితీలో ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమ యోజన ప్రధానమంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాలను ప్రజలందరికీ తెలియజేసేలా చర్యలు తీసుకొని ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.