
జవాబుదారీగా ప్రజల కోసం పనిచేస్తాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేశాం
సగర్వంగా ప్రజల ముందుకు వెళ్ళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతాం
పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
నల్లమాడ, జన సముద్రం న్యూస్, జూలై 02:-
ఇది ప్రజా ప్రభుత్వమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.పుట్టపర్తి నియోజకవర్గం లోని నల్లమాడ మండలం వెళ్ళమద్ది పంచాయతీలోని కొత్తపల్లి తండాలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా వృద్ధులు,వితంతు,వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేపట్టారు.నల్లమాడ మండలంలోని కొత్తపల్లి తండా,రేడ్డిపల్లి , కమ్మవారిపల్లి,నల్లమాడ,చౌటకుంటపల్లి,కొండక మార్ల ,ఓడి చెరువు బీసీ కాలనీ,గాజుకుంటపల్లి,మిట్టపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి జవాబుదారీగా పనిచేస్తామని పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదిలోపే సుమారు 80 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు.ఇది మంచి ప్రభుత్వం ఇదేనని సగర్వంగా చెప్పుకొనే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3వేలు ఉన్న పెన్షన్ ను 4వేలకు పెంచి ఒకేరోజులో 66 లక్షల కుటుంబాలకు 4400 కోట్లు లబ్ధిదారులకు అందజేస్తోందని తెలిపారు. ఇంట్లో చదివే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా రూ.13వేలు తల్లి ఖాతాలో డబ్బులు అందజేశామన్నారు. అంతేకాక పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన యూనిపాం దుస్తులు,మధ్యాహ్నం భోజనం ద్వారా విద్యార్థులకు సన్న బియ్యం,నాణ్యమైన ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఏడాదిలో దీపం పథకం ద్వారా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేశామన్నారు. అంతే కాకుండా మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు.త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి దశ కింద రూ.7వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మైలే శంకర్ ,టీడీపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి,మంజునాథ్ రెడ్డి ,సలాం,గడ్డం రమణారెడ్డి,బుట్టి నాగభూషణం,రామచంద్ర ,నాగరాజు,పాపారాయుడు,రషీద్ ఖాన్,గన్రెడ్డి శివారెడ్డి,అరవింద్ , అభినయ్,తెలుగు మహిళా నాయకురాలు మణి కుమారీ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.