
వైసిపి ప్రభుత్వ హయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.
పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 02:-
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విజన్ కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ రెడ్డి పేర్కొన్నారు.పుట్టపర్తి నియోజకవర్గం లోని కొత్తచెరువు మండలం కొడవ గానిపల్లి,మైలేపల్లి,కొత్తచెరువు,బుక్కపట్నం,పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి బడే నాయక్ తండ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.మాజీ మంత్రికి కూటమి పార్టీల పార్టీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక విజన్ కలిగిన నేత ముఖ్యమంత్రి కావడం వల్ల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. గత 15 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని అన్నారు.జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. దీంతో రాష్ట్రం అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారి అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని అన్నారు.అలాంటి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జులై రెండు నుంచి ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతుందన్నారు.అందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలో బుధవారం అమడకూరు మండలం కసముద్రం నుంచి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శ్రీకారం చుడతారని అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూటమి పార్టీల నాయకులకు,కార్యకర్తలకు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తచెరువు బుక్కపట్నం పుట్టపర్తి కన్వీనర్లు ఒలిపి శ్రీనివాసులు,రామకృష్ణ ,మల్లి రెడ్డి ,విజయ్ కుమార్,బోయ రామాంజనేయులు,టిడిపి సీనియర్ నాయకులు సాలక్క గారి శ్రీనివాసులు,కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ,మాజీ జడ్పిటిసి లక్ష్మీనారాయణ, వెంకటసుబ్బారెడ్డి,వెంకట రాముడు,యశోద గంగాధర్, రామారావు,లక్ష్మీపతి , గంగాధర్ నాయుడు,బెస్త చలపతి,బీసీ గంగన్న,రపి,సురేష్ చౌదరి, కృష్ణ ప్రసాద్,ఉమాపతి,మాల మనోహర్,అబ్దుల్లా,కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.