
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
జిల్లా ఇంచార్జి
జన సముద్రం న్యూస్
తేది జూన్ 2
పాడేరు,,ప్రజలకు సంతృప్తికరమైన రెవెన్యూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సదస్సులు జరిగి 6 నెలలు గడిచినా మ్యుటేషన్లు పరిష్కరించ లేదని తాహశీల్దారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కలెక్టరేట్ వీడికాన్ఫరెన్సు హాలు నుండి సబ్ కలెక్టర్లు, 22 మండలాల రెవెన్యూ అధికారులతో పిజి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారం, మ్యుటేషన్లు, భూముల రీసర్వే, రెవెన్యూ సమస్య పరిష్కారంపై మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 368 రెవెన్యూ సమస్యలు అపరిషృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో రెవెన్యూ సేవలు ప్రజలకు సక్రమంగా అందిండం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎపి సేవా సర్వీసెస్ వెబ్సైట్లో నేటికి పరిష్కరించవలసిన ఫిర్యాదులు ఎన్ని ఉన్నాయని ఆరాతీసారు. పిజి ఆర్ ఎన్, రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తాహశీల్దారులు చొరవ చూపించాలన్నారు. ప్రతీ వారం సమస్యలు పరిష్కారానికి క్షేత్రస్థాయి సిబ్బందితో రివ్యూ చేసి ఈనెలాఖరునాటికి పూర్తి చేయాలన్నారు. మూడు విజన్లలోని సబ్ కలెక్టర్లు సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని చెప్పారు. మ్యుటేషన్ల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. రీ సర్వే వేగంగా జరిపించాలని ఆదేశించారు.
వర్షాలకు ప్రజలు అప్రమత్తం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్సాలకు ప్రజలు అప్రమత్తంగా ఉంటాలన్నారు. మట్టి ఇళ్లు, కచ్చా ఇళ్లలో ఉన్న వారిని పక్కా గృహాలకు తరలించాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాజ్ వేలను గుర్తించి నివేదించాలన్నారు. కొట్టుకుపోయిన కాజ్ వే ఈ వద్ద ప్రమాదకర బోర్డులు, రెడ్ రిబ్బన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలు గెడ్డలు, వాగులు దాటవద్దని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో వాటర్స్ పాల్స్కు పర్యాటకులకు మధ్యాహానం నుండి పర్యాటకులను కూడదని తాహశీల్దారులకు సూచించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ ఫాల్స్క అనుమతించ
జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ భూముల రీ సర్వే ప్రక్రియ ఈనెల 15 తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు రీ సర్వే పకడ్బందీగా చేయించ వలసిన బాధ్యత తాహశీల్దారులపైనే ఉందన్నారు. రీ సర్వే చేయడానికి 13 నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. 13 నోటిఫికేషన్ జారీ సమస్యలు, సాంకేతిక సమస్యలుంటే సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలన్నారు. పెదబయలు, జి.మాడుగల మారేడు మిల్లి మండలాల్లో రీ సర్వే, 13 నోటిఫికేషన్ జారీపై సంతృప్తి వ్యక్తం చేసారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. అదే విధంగా పి జి ఆర్ ఎస్లో చూపించాలని స్వీకరించిన ఫిర్యాదులను త్వరత్వరగా పరిష్కారం చెప్పారు. అర్జీదారులతో రెవెన్యూ అధికారులు మర్యాద పూర్వకంగా మెలగాలన్నారు. గ్రామ పంచాయతీల నుండి వచ్చిన ఫిర్యాదులపై వి ఆర్ ఓలతో సమీక్షించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, డి ఆర్ ఓ కె. పద్మావతి, వర్చువల్గా రంపచోడవరం సబ్ కలెక్టర్
కల్పశ్రీ, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, 22 మండలాల తాహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.