
జగిత్యాల జూన్21జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్
రాయికల్ పట్టణంలోని పలు వార్డులలో సందర్శిస్తూ కెసిఆర్ పాలనలో
సంక్షేమం అభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పని చేస్తే,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. సానిటేషన్ మీద కనీసం శ్రద్ధ కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.
కవితక్క కృషి వల్లే రాయికల్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పాటు అయిందని అన్నార. కవితక్క వల్ల రాయికల్ పట్టణ అభివృద్ధి చెందిందని,కల్వకుంట్ల కవితక్క నిజాంబాద్ ఎంపీగా ఉన్నప్పుడు రాయికల్ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేసిన 25 కోట్ల రూపాయలలో ఇంకా రెండున్నర కోట్ల రూపాయల మిగిలి ఉండడంతో ఆ మిగిలిన నిధులతో పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీలను పూర్తి చేయాలని అన్నారు.డ్రైనేజీ లేక వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని,డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధులు బాధపడుతున్నారని వెంటనే డ్రైనేజీలు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి కాపాడాలని అన్నారు. ఇప్పుడున్న అసమర్థత సీఎం వల్ల తెలంగాణ అభివృద్ధి కుంటుపట్టిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో రాయికల్ పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్,కో ఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి,మండల అధ్యక్షులు బర్కం మల్లేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదయ శ్రీ,నాయకులు మహేష్ గౌడ్,తిరుపతి,ప్రశాంత్ రావు,రామ్ చంద్ర,వినోద్,ప్రసాద్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.