
జన్నారం నూతన ఎఫ్ డి వో రామ్మోహన్
జన సముద్రం న్యూస్ జూన్ 24 (ఖానాపూర్ నియోజకవర్గం)
కవ్వాల్ అడవుల, వన్యప్రాణుల సంరక్షణకు మన అందరి సహకారం ఎంతో అవసరమని జన్నారం నూతన ఎఫ్డిఓ ఎం.రామ్మోహన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ (పులుల) రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ అధికారి గా ఆయన సోమవారం సాయంత్రం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మానవాళి మనుగడకు వన్యప్రాణులు పకృతి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పెద్దపులు ఉంటే అడవులు, వన్యప్రాణులు ఉంటాయని వారు అన్నారు
సృష్టిలోని జీవ వైవిధ్యంలో ప్రాణికోటిలో ఒక్కదానిపై ఒకటి ఆధారపడి మనుగడ సాగిస్తాయని ఆయన చెప్పారు.మానవులు స్వార్థం కోసం అడవులను, వన్యప్రాణులను హతమారుస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధుల,ప్రజల, నాయకుల,అధికారుల సహకారంతో కవ్వాల టైగర్ రిజర్వ్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి, జన్నారం రేంజ్ ఇన్చార్జి సుష్మారావు ఇంధన్ పల్లి అటవీ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్, స్థానిక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత, ఫారెస్ట్ సెక్షన్,బిట్ ఆఫీసర్లు హన్మంతరావు,శివకుమార్, లాల్బాయ్,లవన్ కుమార్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు సరిత,క్రాంతి కుమార్,తదితరులు స్వీట్లు,పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.