
జన సముద్రం న్యూస్ కొత్తగూడ (జూన్ 24 )
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ ఎండి, VC, సజ్జనార్ ఐపీఎస్ ను కలిసిన మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల వేలుబెల్లి గ్రామస్తులు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామపంచాయతీలకు, తండాల ప్రజలు, ఉచిత బస్సు ప్రయాణము ఉపయోగించుకోవడంలేదని, నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్కు వేలుబెల్లి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇదే డిపో మేనేజర్ కు గతంలో పోనీం ప్రోగ్రాంలో ప్రజలు కూడా మాకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నర్సంపేట డిపోకు వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది, ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో డిపో మేనేజర్ కి స్వయంగా వేలుబేల్లి గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించడం జరిగింది. అయినప్పటికీ నర్సంపేట డిపో మేనేజర్ మా గ్రామానికి బస్సు పంపడం లేదనిఎండి సజ్జనార్ కు ఈరోజు వేలుబెల్లి గ్రామస్తులు డాక్టర్ సిహెచ్ రాములు బొజ్జ ప్రణయ్ భాస్కర్ లు కలిసి బస్సు భవన్ హైదరాబాదు లో కలిసి వినతి పత్రమును అందజేయడం జరిగింది.ఆయన తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది