
జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల
మహాబూబాబాద్ జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ జూన్ 21
మహాబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడిఏలు శ్రీనివాసరావు, మురళిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు,
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రైతులకు రైతు భరోస పథకం క్రింద 2025 వానాకాలం సీజనుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అనగా తేది 20.06.2025 రోజు వరకు అందించిన పెట్టుబడి సహాయం ఎకరానికి 6000/- చొప్పున 202.49 కోట్లు, 1,93, 851 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. దీనిలో 22108 మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు 30.24 కోట్లు రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం జరిగింది. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సహాయం – రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కలుపు మందులు కొనుగోలుకు సక్రమంగా వినియోగించుకోవడానికి అందించడం జరిగిందన్నారు,