ఎల్కతుర్తి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్స్.

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025–2026, సంవత్సరానికి 4 తరగతికి సెలక్షన్స్

జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి

మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ

జనసముద్రం న్యూస్ 21
ఎల్కతుర్తి మండలం.

ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ పొందుటకు 4వ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినీలకు మండల స్థాయిలో కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్స్ జరిగినవి.ఇట్టి కార్యక్రమానికి హాజరైన జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సెలెక్ట్ అయిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే సెలక్షన్స్ కు అర్వత పొంది క్రీడా పాఠశాలలో అడ్మిషన్ పొందాలని తెలిపారు.మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు యోగ లాంటివి నేర్పించి వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల లో ప్రతిభ కనబరిచిన పదిమంది బాలురు 10 మంది బాలికలు మొత్తం 20 మంది విద్యార్థులను ఈ రోజు ఎంపిక చేసి జిల్లా స్థాయి సెలక్షన్స్ కు పంపడం జరిగింది అని తెలిపారు.ఆ తదుపరి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల దామర లో సామూహిక వన మహోత్చవం కార్యక్రమం సీ.యం.ఒ
అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మొక్కలను విధిగా పెంచే బాధ్యత వాటిని రక్షించే బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలని ప్రతి పాఠశాల పచ్చదనంతో ఆకర్షణీయంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మొక్కలు నాటిన పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు,ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరైన అధికారులు అందరూ పాల్గొని నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో పనిచేయుచున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాముడు ప్రేమ్ ప్రసాద్ సుధాకర్ దివ్య స్వరూప శ్రీకాంత్ ఉపాధ్యాయులు తిరుపతి హరికృష్ణ శ్రీనివాస్ ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్