
బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు
జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్
బిజెపి హుజురాబాద్ పట్టణ శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాళ్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పర్చిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు.
వారు మాట్లాడుతూ వికసిత్ భారత్, సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అద్భుత నాయకత్వంలో ప్రతి సవాల్ ని ధైర్యంగా ఎదుర్కొని, ప్రపంచంలో అన్నిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.
ఈ దేశం సురక్షితం సుభిక్షంగా ఉండాలంటే బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత జవాన్లు వీరోచితంగా పోరాడి మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి దేశ గౌరవాన్ని పెంచారన్నారు. ఈ దేశంలో స్వదేశీ పరిజ్ఞానం తో తయారుచేసిన ఆకాష్ బ్రహ్మోస్ క్షిపనిలు భారత జవాన్లు సమర్థవంతంగా ఉపయోగించారన్నారు. రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగాయన్నారు.
దేశం మొత్తం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా దిశగా తాటిపైకి ముందుకు సాగుతుందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఇది కేవలం నరేంద్ర మోడీ కల మాత్రమే కాదని 140 కోట్ల ప్రజల ఆశల ప్రతి బింబం అన్నారు.పేదల సంక్షేమం కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా 81 కోట్ల ప్రజలందరికీ ఉచిత రేషన్ స్వచ్ భారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల యోజన, రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటివరకు 3.7 లక్షల కోట్లు రైతుల ఖాతాలోకి పంపిణీ. ఆయుష్మాన్ భారత్ ద్వారా 55 కోట్ల మందికి ఉచిత వైద్యం,అగ్నిపత్ పథకం ద్వారా యువతకు నూతన అవకాశాలు కల్పిస్తున్నారన్నారు.ఇలా అనేక పథకాలు తీసుకొచ్చి పేదల జీవితాలలో వెలుగులు నింపారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను 4 స్థానానికి నరేంద్ర మోడీ తీసుకువచ్చారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడే భారత్ ఇప్పుడు ప్రపంచానికి పరిష్కారాలు అందిస్తుందన్నారు.కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి భారత శక్తి సామర్థ్యాన్ని చూపించిందన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపడితే దాదాపు 170 దేశాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ప్రస్తుతం 190 దేశాలకు పైగా యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గా నిర్వహిస్తున్నాయి. దీనికి నరేంద్ర మోడీ గారి ఎనలేని కృషి ఉందన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ప్రజలంతా బిజెపికి అండగా ఉంటున్నారని,రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎలక్షన్లో కచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని నాయకులు కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి యాళ్ళ సంజీవ్ రెడ్డి,బూత్ అధ్యక్షులు పల్లె వీరయ్య,బొడ్డు మహేష్ నాయకులు పడారి కొంరయ్య,యాళ్ల మల్లారెడ్డి,వేముల హృతిక్,డోరి ఐలయ్య,బోరగాల అజయ్,పిల్లి రాజు,యాళ్ల రాజిరెడ్డి,మార్క మొగిలి, పిల్లి చంద్ర మొగిలి, యాళ్ల రాజు , గోస్కుల పోచలు ,మునిరాజం నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.