
జనసంద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జూన్ 21
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు… ముందుగా కాముని చెరువు సుందరీకరణ పనులను స్వయంగా పరిశీలించి అవసరమైతే హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని సేకరించి అత్యంత సుంద రీకరణంగా తీర్చిదిద్దాలని… కబ్జా అవుతున్న స్థలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. అలాగే బతుకమ్మ కుంటలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. అనంతరం రంగదాముని (ఐడియల్) చెరువు వద్ద ఆ ప్రాంతాన్ని అంతటినీ పరిశీలించి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 19 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి సుందరీకరణ పనులు చేపట్టామని ఇందులో భాగంగానే ఇప్పటికే అత్యంత సుందరంగా కొంత ప్రాంతాన్ని తీర్చిదిద్దామని దాన్ని కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవట్లేదని.. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే మిగిలిన అసంపూర్తిగా ఉన్న పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.. అనంతరం వివేక్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన అసోసియేషన్ సభ్యులు, అధికారుల సమీక్ష సమావేశంలో అసోసియేషన్ సభ్యుల అందించిన వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారులకు అందించారు… శక్తి నగర్, హబీబ్ నగర్, రోడ్ నెంబర్ వన్ వద్ద త్వరలోనే డ్రైనేజ్ సమస్య పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు… సేవాలాల్ నగర్ లోని సిసి రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు…ఈ నేపద్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ బాలాజీ నగర్ లో నూతన ధోభీ ఘాట్ కొరకు ప్రణాళికలు సిద్దం చేయాలని ..అలాగే వీధిలైట్లు ఒక నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిధులు కొరత ఉంటే తనకు తెలపాలని ఆదేశాలు ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాలు బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ,అన్ని విభాగాల అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు…