
ముఖ్య అతిథిగా పాల్గొన్న టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్
జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్
హుజురాబాద్ పట్టణంలోని స్థానిక న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ షో టో ఖాన్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్టులో విజయం సాధించిన కరాటే విద్యార్థులను ఘనంగా సన్మానించనైనది.ఇట్టి సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ కరాటే ను తన వృత్తిగా ఎంచుకొని,తోటి కరాటే మాస్టర్స్ కు ఆదర్శంగా ఉంటూ, ఎంతోమంది విద్యార్థుల ను తీర్చిదిద్దుతు, వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్న కరాటే శ్రమజీవి మాస్టర్ ఎస్కే జలీల్ ను అభినందించి నారు.కరాటే విద్యార్థుల శారీరక అభివృద్ధితో పాటు, వారు మానసికంగా ఎదుగుటకు అదేవిధంగా కరాటే పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, సమాజంలోని ఏ సమస్యనైనా ఎదుర్కొనుటకు తోడ్పడుతుందన్నారు.ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ముందడుగు వేస్తూ తమను తాము రక్షించుకోవడంతోపాటు, తోటి ఆడపిల్లలను కాపాడడానికి వారిలో ధైర్యాన్ని పెంపొందిస్తుంద నే నమ్మకాన్ని వ్యక్త పరచినారు.కార్యక్రమంలో రిటైర్డ్ పి ఈ టి సొల్లు సారయ్య,ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఖలీద్ హుస్సేన్, ఆకుల సదానందం, బత్తుల రాజకుమార్, టి.గోపాల్, దాసరి మల్లేశం, ఎండి సల్మాన్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.