చిన్నమండెం, చాలా సముద్రం న్యూస్ జూన్ 15:
చిన్నమండెం మండలం దేవగుడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిశ్చల్ నాగిరెడ్డి నివాళులు అర్పించారు.
మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలిపారు.





