కిసాన్ మోర్చా రీజినల్ ఇంచార్జి చింతా శరత్ కుమార్ రెడ్డి
పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూన్ 15:-
భాజపా కిసాన్ మోర్చా రీజినల్ ఇంచార్జ్ చింతా శరత్ కుమార్ రెడ్డి పుట్టపర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాలుగా దేశాన్ని సేవ,సుశాసనం,పేదల సంక్షేమం దిశగా చారిత్రక మార్గంలో నడిపిస్తున్నారు.దేశ భద్రత,అభివృద్ధి,అంతర్జాతీయ పరపతి—ఆల్ రౌండ్ డెవలప్మెంట్ —ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి అన్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో సమావేశాలు నిర్వహించి,ప్రతి గ్రామంలో కిసాన్ మోర్చా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించబడినట్టు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనలో ముఖ్య మైనవి:
- సైనిక పరాక్రమం:- ఉగ్రవాదంపై ఉరీ, బలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం.
- ఆర్ధిక పురోగతి: భారతదేశ రక్షణ ఎగుమతులు రూ 23,622 కోట్లకు పెరిగాయి.
- పేదల సంక్షేమం:- ఉచిత ధాన్యం పంపిణీ ద్వారా కోట్ల మందికి లబ్ధి.
- వ్యవసాయ అభివృద్ధి:- పి ఏమ్ -కిసాన్ ద్వారా రూ 3.7 లక్షల కోట్ల నేరుగా రైతులకు అందించటం.
- ఆరోగ్య రంగం:- ఆయుష్మాన్ భారత్ ద్వారా 55 కోట్ల మందికి ఆరోగ్య భద్రత.
- *మహిళా సాధికారత:- బేటీ బచావో,బేటీ పఢావో ద్వారా లింగ నిష్పత్తిలో మెరుగుదల.
- విద్యా రంగం:- కొత్త ఐఐటీ లు,ఐఐఎమ్ లు స్థాపన, జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా విప్లవం.
- *బౌద్ధిక నాయకత్వం:- జీ 20 అధ్యక్షతతో భారతదేశం ప్రపంచ సమరసతకు వేదికగా మారింది.
- అంతరిక్ష విజయం:- చంద్రయాన్-3 విజయంతోపాటు గగన్ యాన్‌కు సిద్ధత.
ఈ సమావేశంలో పుట్టపర్తి నగర బిజెపి అధ్యక్షులు ఎన్. కళ్యాణ్, సీనియర్ నాయకులు,సోకే రామాంజనేయులు,ఎల్వీ రమేష్ బాబు పాల్గొన్నారు.నాయకులందరూ రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా గ్రామస్థాయికి పటిష్టంగా పార్టీ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.అభివృద్ధి పునాది – జన భాగస్వామ్యం,బలమైన నాయకత్వం అని పేర్కొన్న చింతా శరత్ కుమార్ రెడ్డి గ్రామస్థాయిలో కిసాన్ మోర్చా కార్యకర్తలను ఏర్పరచి అమృత్ కాలంలో దేశ అభివృద్ధికి భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.





