త్యాగానికి ప్రతీక బక్రీద్.
అల్లూరి జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్,తేది జూన్ 08
చింతపల్లి :- త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పర్వదినం “బక్రీద్” దీనినే ఈద్-ఉల్ – ఆదా అని కూడా సంబోధిస్తారు. ప్రవక్త ఇబ్రహీం కు లేకలేక మగ బిడ్డ జన్మిస్తాడు. అల్లా పట్ల ఎంతో భక్తి గల ప్రవక్త ఇబ్రహీంకు ఆ బిడ్డ అంటే అమితమైన ప్రేమ. ఈ క్రమంలో ఇబ్రహీం అల్లా నుంచి తనకు అత్యంత ఇష్టమైన బిడ్డను తన మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలని కల రావడంతో ఆ విషయాన్ని కుమారుడైన ఇస్మాయిల్ కు చెప్పగా కుమారుడు అందుకు సుముఖత వ్యక్త పరచిన సందర్భంగా ఇబ్రహీం అల్లాహ్ పట్ల భక్తితో తన కొడుకును బలి ఇవ్వడానికి మహమ్మద్ ప్రవక్త ఇబ్రహీం సంసిద్ధుడై. తన ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్ ను అల్లాహ్ మార్గంలో బలి ఇచ్చేందుకు సిద్ధపడటంతో ఇబ్రహీం, ఇస్మాయిల్ ల యొక్క భక్తిని మెచ్చిన అల్లా బలిపీఠం పై నుంచి ఇస్మాయిల్ ను తప్పించి ఆ స్తానంలో మేకను బలి ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లిమ్ లు నిర్వహించుకునే పర్వదినం బక్రీద్. దీనినే ఈద్-ఉల్ – అదా అని అంటారు. త్యాగ నిరతికి గుర్తుగా ముస్లింలు ప్రతీ ఏటా జిల్ హజ్ నెల మొదటి పడవ రోజు ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు.అందులో భాగంగా శనివారం స్థానిక మజీద్ ఈ క్యూబా లో మత గురువు (ఇమామ్) షహీద్ ముస్లింల చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్ పండుగ విశిష్టత ను వివరించారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని మత సామరస్యాన్ని చాటుకున్నారు. అదే క్రమంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు ముస్లింలు ఖుర్బానీ ఇచ్చి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మీరా సాహెబ్, కమిటీ సభ్యులతో పాటు చింతపల్లి పరిసర గ్రామాల ముస్లింలు పాల్గొన్నారు.





