వెయ్యి వెన్నుపోటుల సమాహారం జగన్..!

Spread the love

ద్రోహులతో నిండిన పార్టీ వైసీపీ..!

..ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజం..!

జనసముద్రంన్యూస్, జూన్ 8, వెల్దుర్తి మండలం ;

వెయ్యి వెన్నుపోటులకు సమాహారం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., అన్నీ వర్గాలకు వెన్నుపోటు పొడిచి.., సిగ్గులేకుండా వెన్నుపోటు దినం అని కార్యక్రమాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. పిన తండ్రికి .., కన్న తల్లికి, తోడబుట్టిన చెల్లెలకు వెన్నుపోటు పొడిచి వారి కుటుంబాలను వీధిన పడేసిన పరమ దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. బడుగు బలహీన, అణగారిన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వారి వెన్ను విరిచి ఐదేళ్లు నరకం చూపించారని ఆరోపించారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ కుంభకోణాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెన్ను విరిచి.., లక్షల కోట్లు దోచుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. చదువుకున్న యువత ఆశలపై నీళ్లు చల్లి.., వారి బంగారు భవిష్యత్తును అంధకారంలో పడేసింది మీరు కాదా అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిలదీశారు. ఎస్సీ – ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించిన జగన్ రెడ్డి.. వారిని సామాజికంగా దెబ్బతీశారని వివరించారు. దుల్హన్ పథకాన్ని రద్దుచేసి, ముస్లింలను నిలువున మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అన్ని విధాలుగా మోసం చేసి.., నేడు వెన్నుపోటు దినం అంటూ రోడ్డెక్కడం హాస్యస్పందంగా ఉందన్నారు. అందుకే ప్రజలు జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బాగా బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో అన్నీ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.., ప్రజల మన్నలను పొందుతోందని చెప్పుకొచ్చారు. గత పాలనలో జరిగిన ఆర్ధిక విధ్వంసాన్ని లెక్కలు వేసుకుంటూ.., పథకాలకు అయ్యే ఖర్చులను బేరీజు చేసుకుంటూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎంతో నిబద్దతతో ముందుకు పోతున్నారని వివరించారు.

ఫ్యాక్షనిస్టులు, రౌడీ షీటర్లే మిత్రులు..!

గంజాయి మామ జగన్ రెడ్డికి ఫ్యాక్షనిస్టులు, రౌడీ షీటర్లే మిత్రులని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడి చేసి.., హల్చల్ సృష్టిస్తే.., వారికి మద్దతు ఇచ్చి.. పరామర్శకు వెళ్లడం విడ్డూరమన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయం మూడు హత్యలు, ఆరు దౌర్జన్యాలతో విరాజిల్లుతుంటే.. ఆయనకు పార్టీలో జిల్లా పదవులు కట్టబెట్టి.., ప్రోత్సహిస్తుంటారని విమర్శించారు. దందాలు, దౌర్జన్యాలు, దాడులు చేసేవారికి వైసీపీలో జగన్ రెడ్డి పెద్దపేట వేస్తారని ఆరోపించారు. అందుకే ఏపీలో సైకోలను సాగనంపి.., ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి