అగ్మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్

Spread the love

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.07)
జనసముద్రం న్యూస్ పోచారం మున్సిపల్ పరిధి శ్రీనిధి యూనివర్సిటీలో అగ్ మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ పి సుధా రెడ్డి ఎం డి కే ఎన్ బయోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతరత్న అవార్డు గ్రహీత.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రోన్ శిక్షణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వ్యవసాయ రూమ్ సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రెక్కలుతున్నాయి.

రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటి వినియోగం పరిష్కారంగా కనిపిస్తుంది.కొందరు యువకులు అగ్మే సంస్థలు ఏర్పాటు చేసిన డ్రోన్లను రైతులకు చర్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికత పెంచేందుకు రెక్కలుతున్నాయి.డోన్ లో వినియోగం మొదట్లో రక్షణ రంగంలో ఉన్న డ్రోన్ వినియోగం ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించింది.వ్యవసాయంలో డ్రోన్లు వాడకంలో జపాన్,చైనా ముందున్నగా ఇటీవల కాలంలో మనదేశంలోనూ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విడిగా వాడడం మొదలుపెట్టారు.శ్రీనిధి యూనివర్సిటీలో టెక్నాలజీలో శిక్షణ తరగతులు నిర్వహించి శిక్షణ పూర్తి అయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని,వారికి కావాల్సిన పరికరాలను కూడా అందిస్తామని సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్,,శ్రీ కొండ జై భజరంగ్ మనీ లక్ష్మీ కాంతారావు,సంతోష్ రెడ్డి,రాజు,సురేష్ రెడ్డి,కే అభిజిత్ రావు,డాక్టర్ సిహెచ్ శివారెడ్డి ,సీఈఓ ఎం అజయ్ సాగర్,కోఆర్డినేటర్స్ ఎస్ పి వి సుబ్బారావు,డాక్టర్ సిఎన్ సుజాత,ప్రొఫెసర్ అండ్ అసోసియేషన్ అకాడమిక్స్ శ్రీనిధి కాలేజ్ వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రెక్కలు విప్పనున్నాయి.రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటి వినియోగం ఓ పరిష్కారంగా కనిపిస్తోంది.కేంద్రం బడ్జెట్లో చేసిన వ్యవసాయ డ్రోన్ల ప్రకటన ఈ రంగంపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది.ఇంతకీ డ్రోన్లతో ఉపయోగాలు ఏమిటి.ఎన్ని రకాలుగా వీటిని వినియోగించవచ్చు.ఏ తరహా పంటలకు ఇవి అనుకూలం,డ్రోన్ల విస్తృతికి ఉన్న అడ్డంకులేంటి.ప్రభుత్వాలు ఏంచేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తీరు మారుతోంది.కొన్నేళ్ల నుంచి యంత్రాల వాడకం బాగా పెరిగింది.వాటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం వాడకం తప్పనిసరిగా మారింది.కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు ఉన్న అవకాశాలపై అందరూ దృష్టి పెడుతున్నారు.ఈ క్రమంలో దూసుకు వచ్చిందే డ్రోన్ల వినియోగం.మొదట్లో రక్షణ రంగంలో ఉన్న డ్రోన్ల వినియోగం ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించింది.వ్యవసాయంలో డ్రోన్ల వాడకంలో జపాన్,చైనా,ముందుండగా ఇటీవల కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడడం మొదలు పెట్టారు.క్రమంలో భారత్లోనూ డ్రోన్ల వాడకంపై ప్రయోగాలు జరిగాయి.ప్రధానంగా పంటలకు పురుగుమందుల పిచికారి,ఎరువులు,విత్తనాలు వెదజల్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు.పురుగుమందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలనిస్తోంది.వరిసాగు చేసే రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.బురదలో దిగి సాధారణ స్ప్రేయర్లతో మందుల పిచికారీ పెద్ద ప్రయాసే.చాలామంది తేళ్లు,పాముకాట్ల బారిన పడేవారు.అలాగే ఎత్తులో పెరిగే పంటలకు సంబంధించి పిచికారి కష్టమైన పని.మొక్కజొన్నతో పాటు పండ్ల తోటల్లో ఈ సమస్య ఎక్కువగా ఎదురయ్యేది.ఇలాంటి వాటికి డ్రోన్లు పరిష్కారం చూపాయి.డ్రోన్ సాయంతో పైనుంచి పిచికారీ చేయటం సులువైంది.డ్రోన్ల వాడకంతో సమయం బాగా కలిసొచ్చింది.ఎకరా పొలానికి 5నుంచి 6 నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుంది.మామూలు స్ప్రేయర్లతో గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది.పంటకు తెగులు వచ్చినప్పుడు ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాల్సి ఉంటుంది.అలాంటి సమయంలో కూలీలు దొరక్క పిచికారీ అలశ్యమైతే పంట పాడైపోయేది.డ్రోన్లు వచ్చాక ఆ ఇబ్బంది తప్పింది.పురుగుమందులూ ఆదా చేయవచ్చు.గతంలో కంటే 30 నుంచి 40% మేర తగ్గించి స్ప్రే చేసినా మంచి ఫలితాలు వస్తున్నట్లు తేలింది.పురుగు మందులు పిచికారీతో రైతులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా తప్పాయి.డ్రోన్లు వినియోగంలోకి తెచ్చేందుకు కొందరు ఔత్సాహికులు అంకుర సంస్థలు ఏర్పాటు చేశారు.వీరిలో ఎక్కువగా ఇంజినీరింగ్ చదివిన యువత ఉన్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒడిదుడుకుల్ని చూసి ప్రత్యామ్నాయాలు ఆలోచించేవారు డ్రోన్ల కంపెనీలు ఏర్పాటు చేశారు.మొదట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు.మరికొందరు విడిభాగాలు తెచ్చి ఇక్కడ డ్రోన్ల తయారీ మొదలుపెట్టారు.స్థానిక అవసరాలు గుర్తించి అందుకు తగ్గట్లుగా మార్పులు చేశారు.అలాగే కొన్ని పరికరాల్ని స్థానికంగా సమకూర్చుకున్నారు.బ్యాటరీలతో పాటు ఇంజిన్తో పనిచేసే డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు.వాటిని రైతుల పొలాల్లో పురుగుమందులు చల్లటానికి వినియోగిస్తున్నారు.దీనికిగాను ఎకరాకు ఇంతని వసూలు చేస్తున్నారు.అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన యువతకు ఇదో ఆదాయమార్గంగా మారింది.కొందరు ఎక్కువ డ్రోన్లు కొని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు.ఇంజినీరింగ్,పాలిటెక్నిక్ చదివిన వారికి డ్రోన్ పైలెట్లు,హెల్పర్లుగా శిక్షణ ఇస్తున్నారు.అనంతరం వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు.తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చినట్లయింది.పెద్దరైతులు సొంతగా డ్రోన్లు కొనుగోలు చేసి పొలాల్లో వినియోగిస్తున్నారు.ఏపీలో ముఖ్యంగా కృష్ణా,గుంటూరు,ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రోన్ల వాడకం ఎక్కువగా ఉంది.రాయలసీమ ప్రాంతంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ఒరవడి మొదలైంది.కర్నూలు,కడప జిల్లాల్లో కొందరు డ్రోన్లు అద్దెకు ఇవ్వటం ద్వారా ఆదాయం పొందుతున్నారు.డ్రోన్ల వినియోగానికి సంబంధించి వ్యాపారస్తులు పెళ్లిళ్లు శుభకరంలో వాడుతున్నారని వారికి మంచి లాభాలు కూడా అందిస్తున్నాయని తెలిపారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్