
బిజెపి 11 సంవత్సరాలలో ఎన్నో చారిత్రక విజయాలతో నరేంద్ర మోదీ సారధ్యంలో దూసుకు పోతుంది
– బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
బిజెపి చొప్పదండి రూరల్ మండల అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో మండల (వర్క్ షాప్) కార్యశాలలో ముఖ్యఅతిథిగా హాజరైన బోయిన్పల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ వరుసగా 2014 నుండి ఇప్పటివరకు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం భారత దేశ దిశా దశ మార్చిందని గత 11 ఏళ్లలో దేశం కోసం ఎన్నో అద్భుతాలు చేపట్టి చారిత్రక విజయాలతో ముందు కొనసాగుతుందని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు.. అలాగే బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ఆదేశాల మేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం పేరిట చేపట్టే వివిధ కార్యక్రమాలకోసం శుక్రవారం రోజున చొప్పదండి బిజెపి శ్రేణులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సహకారం దిశగా ఆత్మవిశ్వాసంతో ఎన్నో చారిత్రక విజయాలతో మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు విజయవంత పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉన్నామని తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, అదేవిధంగా ఆపరేషన్ సింధు లాంటి చారిత్రక విజయంతో దేశ ఖ్యాతి విశ్వంలో మార్మోగిపోతుందన్నారు. జాతీయ పార్టీ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం పేరిట చేపట్టాల్సిన ప్రోగ్రాంలను బిజెపి శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 15 వరకు తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 23న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, 25న ఎమర్జెన్సీ డే లాంటి ముఖ్య కార్యక్రమాలను ఉన్నాయని, పార్టీ సూచన పత్రంలో ఉన్న అన్ని కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ విజయవంత పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత త్రివిదదళాలకు, ప్రధాని మోదీ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, ఎంపిటిసిల మండల అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, తోట కోటేష్, సర్పంచ్ గుంట రవి, బిజెపి సీనియర్ నాయకులు సింగిరెడ్డి భూమిరెడ్డి, విలాసాగరం అంజయ్య, బద్దన పెళ్లి రాజేందర్, ఎడ్ల సురేష్, ముద్దం చందు, దయ్యాల శేఖర్, దామెర మధుసూదన్ రెడ్డి, జక్కుల అంజయ్య, మడ్డి పరశురాములు, తాటికొండ కుమార్, దూస చిరంజీవి, గసికంటి రవి, మండల సతీష్, ముని, మారుతి తిరుపతి, కుక్కల అంజయ్య తమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు.