
తమ నివాసాలలో నీరు నిల్వ ఉన్న పాత్రలను శుభ్రం చేసి నీరు నిలువ లేకుండా చూడాలని ..
స్వచ్ఛత పశుభ్రత పాటించండి…
కమిషనర్ రామలింగ
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __
100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు అనగా 06. శుక్రవారం భువనగిరి పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రామలింగం పలు ప్రాంతాలలో పర్యటించి నీరు నిల్వ ఉన్న గుంటలలో దోమల నివారణకై ఆయిల్ బాల్స్ ను వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల నివారణకు ప్రతి ఒక్కరు కంకణ భక్తులు కావాలని తమ నివాసాలలో నీరు నిల్వ ఉన్న పాత్రలను శుభ్రం చేసి నీరు నిలువ లేకుండా చూసుకోగలరని పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా అందరూ చేస్తే దోమల నివారణకు కొంతవరకు దోహద పడిన వాళ్ళవుతారని తెలియజేయడం జరిగింది. ఇటి కార్యక్రమంలో శానిటరీ ఇన్స్ పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.