బక్రీద్ పండుగ త్యాగానికి, భక్తికి ప్రతీక. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

Spread the love

ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండగ జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ.. విద్యాసాగర్ నాయుడు

రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 7

అన్నమయ్య జిల్లాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ అదా (బక్రీద్) త్యాగానికి, భక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని తీసుకురావాలని, ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రాయచోటి, జూన్ 6 ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గో సంరక్షణ చట్టం 2017 అమలులో ఉంది. గోవులను వదించడం పూర్తిగా నిషిద్ధం. ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

కుల మతాలకు అతీతంగా పండగలు జరుపుకుంటూ అన్నమయ్య జిల్లా ప్రజలు సోదర భావంతో మెలిగి స్ఫూర్తిగా నిలవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను, పుకార్లను ఎవరు నమ్మకూడదని షేర్ చేసే ముందు అందరూ ఆలోచించాలన్నారు.
ఏ చిన్న సమస్య అయినా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
జిల్లాలో సామాజిక మాధ్యమాల గ్రూపులలో వచ్చే సందేశాలపై, దృశ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, సోషల్ మీడియాలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు 24×7 ఆయా గ్రూపులను పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
పండుగల సందర్భంగా వదంతులు, పుకార్లను నమ్మకూడదని తెలియజేయాల్సిన బాధ్యత మత పెద్దలదేనన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వీడియోలను గాని, వార్తలు గాని, షేర్ చేసే ముందు నిజమా కాదా తెలుసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల గ్రూపులలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారి పై ఆయా గ్రూప్ అడ్మిన్లపై చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.

ముఖ్యంగా ప్రింట్ మీడియా, మరియూ ఎలక్ట్రానిక్ మీడియా వారు పోలీసు శాఖ కు సహకారం అందిస్తూ.. పోలీసు శాఖ నిర్ధారించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని, మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా.. మా నోటీసుకు తీసుకువచ్చి నిర్ధారణ చేసుకొని పబ్లిస్ చేయాలన్నారు. మనోభావాలను గౌరవించుకుంటూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ పోలీస్ యంత్రాంగానికి సహకరించాలన్నారు.
పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ
పండుగ ప్రార్థనలు జరిగే మసీదులు, ఈద్గాలు, ఇతర కీలక ప్రాంతాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
పండుగ సందర్భంగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సులభతరం చేయాలి.
పోలీసు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. ఏదైనా సహాయం కావాలంటే వెంటనే స్పందించాలి.
స్థానిక మత పెద్దలు, కమ్యూనిటీ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి.
అవసరమైతే శాంతి కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే సందేశాలపై నిఘా ఉంచి, తక్షణమే చర్యలు తీసుకోవాలి.
పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్