నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు .
జనసముద్రం న్యూస్ మాచర్ల (బ్యూరో) జూన్ 7.
పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో అనధికారిక జంతు వధశాలలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దున్నలు, గేదెలు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు తరలింపును పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, ఆంధ్రప్రదేశ్ గోహత్య నిషేధం, జంతు సంరక్షణ చట్టం 1977, జంతువుల పట్ల క్రూరత్వ చర్య చట్టం 1960 ప్రకారం జంతు వదలను నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





