
టిడిపి నాయకునికి కడప డిసిఎంఎస్ చైర్మన్ పదవి..!!
నేడే యర్రగుండ్ల జయప్రకాష్ ప్రమాణ స్వీకారోత్సవం..!!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూన్ 7 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన యర్రగుండ్ల జయప్రకాష్ కు ఎన్డీఏ కూటమిలో భాగంగా టిడిపి పార్టీ తరఫున కడప డిసిఎంఎస్ చైర్మన్ గా ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా కేటాయించడం జరిగింది. చైర్మన్ గా శనివారం నాడు అంగరంగ వైభవంగా కడప మహానగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం జరుగుతుందని రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి శ్రేణులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా బలిజ సామాజిక వర్గానికి నేను ఎటువంటి నేను చేయను సముచిత న్యాయం చేస్తానని మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి జిల్లాల లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన యర్రగుండ్ల జయప్రకాష్ కు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కేటాయించి ఇచ్చిన మాట పైన నిలబడే నాయకుడు అని టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. కడప డీసీఎంఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జయ ప్రకాష్ ను డ్రీమ్ టైమ్స్ న్యూస్ ప్రతినిధి మీకు ఈ పదవి రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు నా తల్లిదండ్రులు రిటైర్డ్ ఉపాధ్యాయులు కృష్ణయ్య, తల్లి మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ రామలక్ష్మమ్మ నేను టిడిపి పార్టీ తప్ప మరే ఏ పార్టీ జెండా పట్టకుండా ఒకే పార్టీ ఒకే జెండా అంటూ టిడిపి పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ ఈ స్థాయికి రాగలిగామని తెలియజేస్తూ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నా తల్లిని టిడిపి తరఫున ఎంపీటీసీగా సర్పంచ్ గా గెలిపించుకొని సెట్టిగుంట గ్రామపంచాయతీ లో టిడిపి జెండా ఎగరవేయడం జరిగిందని తెలియజేశారు. టిడిపి జాతీయ కార్యదర్శి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గతంలో చేపట్టిన యువగలం పాదయాత్రలో ఆయనతో పాటు పాల్గొని వైసిపి అరాచక పాలనకు నా వంతు కృషి చేయడం జరిగిందని తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మార్చడంలో విశేష కృషి చేసి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థి గెలుపులో నా వంతు కృషి చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా నాకు ఈ పదవి రావడానికి కారణమైన టిడిపి నియోజకవర్గ బాధ్యులు, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.టిడిపి పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుందని యర్రగుండ్ల జయ ప్రకాష్ నిదర్శనమని నియోజకవర్గ టిడిపి పార్టీ శ్రేణులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప డీసీఎంఎస్ చైర్మన్ గా యర్రగుండ్ల జయప్రకాష్ ను నియమించడం పట్ల బలిజ సామాజిక వర్గీయులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.