ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు 4,42,123 ఆర్థిక సహాయం మంజూరు
ఈ క్రమంలో కోడూరు మండలంలోని పలు పంచాయతీ లలో పర్యటించి బాధితులకు స్వయంగా చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ముక్కా వరలక్ష్మి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం కు చెందిన 9 కుటుంబాలకు కలిపి రూ.4,42,123/- ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది.
లబ్ధిదారుల వివరాలు:-
అనంతయ్యగారి ప్రసాద్ రూ.50,000/-
కోడూరుమండలం,జంగిటివారిపల్లి గ్రామం
బంకపురి వెంకటమ్మ రూ.27,000/-
కోడూరు మండలం,జంగిటివారిపల్లి గ్రామం
చల్లం నరసింహులు రూ.59,884/
కోడూరు మండలం, అనంతరాజు పేట, రామయ్యపాలెం గ్రామం
దేశు విశ్వనాధ రెడ్డి రూ.65,000/
కోడూరు మండలం, అనంతరాజుపేట పంచాయతీ, తూర్పు పల్లి గ్రామం
వెయ్యల లోహిత రూ.35,000/
రైల్వే కోడూరు మండలం, ఊర్లగడ్డపోడు అరుంధతి వాడ
అవలకుంట సుబ్బ లక్ష్మమ్మ రూ.47,642/- కోడూరు మండలం ఊళ్లగడ్డ పోడు పంచాయతీ,గజ్జలవారిపల్లి గ్రామం
కమలగిరి నాగమన్నెమ్మ రూ.40,000/-
కోడూరు మండలం, తిమ్మిశెట్టి పల్లి పల్లి, ST కాలిని
.కస్తూరి శంకరయ్య రూ.45,933/-
ఓబనపల్లి పంచాయతీ బయనపల్లి గ్రామం శేఖర్ రెడ్డి రూ.71,664
కోడూరు మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ కేసి అగ్రహరం గ్రామం
ఈ చెక్కులను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి సతీమణి ముక్కా వరలక్ష్మి బాధిత కుటుంబాలకు స్వయంగా పరామర్శించి అందజేశారు.ముక్కా వరలక్ష్మి వారు మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్క బాధితుడికి సహాయాన్ని అందించి వారి జీవితాలలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






