
యం.ఆర్.పి.ఎస్ కి చెందిన ఆ ఇద్దరు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4జూన్
హుజురాబాద్ నియోజకవర్గంలోన ఓ అక్షరం ముక్క రాయలేని ఓ అజ్ఞాని ఎమ్మార్పీఎస్ కార్యకర్త అంటూ చెప్పుకుంటూ మందకృష్ణ మాదిగకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తుండడం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలలో చర్చిననీయాంశంగా మారింది.
పీకలదాకా మద్యం సేవిస్తూ వివిధ పార్టీల జెండాలను మారుస్తూ సామాన్య జనులను, చదువుకున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను
మోసం చేస్తూ ఉంటాడు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వీళ్ళ ముగ్గురి ప్రవర్తనను గ్రహించి దూరంగా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ కుమార్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు చెరువుగా ఉండాలని కోరుతున్నారు.
ఈ విధంగా యం.ఆర్.పి.ఎస్. జెండా పట్టుకొని మండలానికి ఒకరు, ఇద్దరు ఉంటూనే వివిధ ప్రభుత్వ ఆఫీసులలో చలామణి కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.

ఎమ్మార్పీఎస్ జెండా ఒకటేమిటి బి.ఆర్.ఎస్, బిజెపి, కాంగ్రెస్ అంటూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ జెండాలు మోస్తూ మారుస్తూ ఉంటారు.
ఇటీవలనే దళితులపై జరిగే దాడులకు ప్రధాన కారకులవుతున్నారు. అగ్రవర్ణాల వద్ద కొంతమంది బిసి ల వద్ద వంగబడుతూ ఉండడం విశేషం.
వారు ఇచ్చే మద్యానికి, కాసులకు బానిసై దళిత జాతిని తాకట్టు పెడుతూనే ఉన్నారని హుజురాబాద్ నియోజకవర్గం లో పలువురు కార్యకర్తలు తమ తమ ఆవేదనలను వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వారి ప్రవర్తన పై ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది.
గతంలో ఇల్లందకుంట మండలం లోని టేకుర్తి గ్రామంలో ఓ దళిత యువకుడి పై దాడి జరిగితే బీసీలకు మద్దతు తెలుపుతూ దళితులను దూరం పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విపరీతంగా మద్యం సేవిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల పెత్తనం చెలాయిస్తూ సైకో ల బిహేవియర్ చేస్తూ ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇల్లందకుంట, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లలో పోలీసులకు ఇంకా వంగబడుతూ దళిత జాతిని తాకట్టు పెట్టడం ఆనవాయితీగా మారింది.
అక్షరం ముక్క రాని అజ్ఞాని ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు, దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు నావే అంటూ నేనే కాబోయే సర్పంచి అంటూ చిలుక పలుకులు పలుకుతూ ఉంటాడు.
ఈ విషయం గ్రహించిన కొందరు గత పంచాయతీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడం జరిగింది.
సదరు ఆ ఇద్దరు యం.ఆర్.పి.ఎస్ వ్యక్తుల ప్రవర్తన తీరుపై సామాన్య జనులు, ఉద్యోగ, వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేధావి వర్గాలు, సామాజిక కార్యకర్తలు, సామాజిక విశ్లేషకులు, మహిళా సంఘాలు, సూచనలు చేస్తున్నాయి.